ఈ నెల 8 నుంచి తెలంగాణలో థియేటర్స్ ఓపెన్ !

-

కరోనా మహమ్మారి కారణంగా టాలీవుడ్ పరిశ్రమ కు తీవ్ర నష్ట్రం వాటిల్లిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా… సినీ కార్మికులు… ఉపాధి లేకపోవడం తో రోడ్డు న పడ్డారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లను రీ- ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్ తో… టాలీవుడ్ నిర్మాతలు ఇవాళ భేటి అయ్యారు.

ఈ భేటీలో విద్యుత్, నిర్వహణ సర్వీస్ ఛార్జీలు, పార్కింగ్ ఫీజు వసూలు సహా తదితర రాయి తీలు కల్పించాలని తెలంగాణా సిఎస్ సోమేష్ కుమార్ ను కోరారు నిర్మాతలు. అయితే నిర్మాతల డిమాండ్ల పై సిఎస్ సోమేష్ కుమార్ సానుకూలంగా స్పందించారని సమాచారం.

త్వరలోనే వీటిపై ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని నిర్మాతలతో సిఎస్ సోమేష్ చెప్పారు. అలాగే ఈనెల 8 నుంచి 100 శాతం సామర్థ్యంతో థియేటర్లు పున ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది. కాగా ఏపీ లో థియేటర్లు పున : ప్రారంభం కానున్నట్లు జగన్ సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news