శృంగారానికి ముందు ఈ ఆహారాలు తీసుకుంటే.. ఇక రెచ్చిపోవడమే..

-

శోభనం రోజు పడకగదిని అందంగా ముస్తాబు చేస్తారు. ఎన్నో రకాల పూలు, అగరబత్తీల వాసనతో పడకగదిని అలంకరిస్తారు. ఒక పక్కన టేబుల్ మీద రకరకాల పండ్లు, స్వీట్లు ఉంచుతారు. అందులో చాలామటుకు శృంగార కోరికలను రెచ్చగొట్టేవే అయి ఉంటాయి. మీకిది తెలుసా? శృంగారం ముందు కొన్ని రకాల పండ్లను తీసుకుంటే బాగుంటుంది. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ

చరిత్ర ప్రకారం సంతాన సాఫల్యతను, శృంగార భావనలను దానిమ్మ పండు పెంచుతుందని నమ్ముతారు. రతిక్రీడకి ముందు ఒక గ్లాసు దానిమ్మ జ్యూసు తాగితే, రక్తప్రసరణ సరిగ్గా జరిగి, ఉత్సాహాన్ని పెంచుతుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగి, పడకగదిలో రెచ్చిపోతారు.

చాక్లెట్

దీని గురించి చెప్పాల్సిన పనిలేదు. చాక్లెట్ వల్ల సెక్స్ హార్మోన్ ఉత్తేజం చెంది సరికొత్త మూడ్ ని క్రియేట్ చేస్తుంది. కామకోరికలతో రెచ్చిపోయేలా చేయడంలో చాక్లెట్ ని మించినది లేదనే చెప్పాలి.

పాలకూర

నిజానికి పాలకూరని శృంగార ఆహారంగా ఎవరూ గుర్తించరు. కానీ, అందులోని మెగ్నీషియం, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేయడంలో సాయపడుతుంది. అంతేకాదు భావప్రాప్తి, కోరిక, సంతృప్తి కలగడానికి ఐరన్ సాయపడుతుంది.

పుచ్చకాయ

ఇందులో ఉండే సిట్రలిన్ అనే అమైనో ఆమ్లం, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంగస్తంభన ఇబ్బందులు రాకుండా రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చేయడంలో ఇది బాగా సాయపడుతుంది.

అవొకొడో

గుండె ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కలిగి ఉన్న అవొకోడో, పడకగదిలో మిమ్మల్ని రెచ్చిపోయేలా చేయడంలో ముందుంటుంది. అలసట, బలహీనత వంటి లక్షణాలను దూరం చేస్తుంది. మీ మహిళా భాగస్వామిని తొందరగా మూడ్ లోకి దింపడానికి అవొకోడో బాగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news