YS SHARMILA : వైఎస్ నాయకత్వాన్ని నిలబెడతా… రాజన్న రాజ్యం తెస్తా : వైఎస్ షర్మిల

-

వైఎస్ నాయకత్వాన్ని నిలబెడతా… రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితమే.. తల్లి విజయమ్మ తో కలిసి కొత్త పార్టీని షర్మిలా ప్రకటించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్.. చెరగని చిరునవ్వు.. చెక్కు చెదరని రూపమని…కష్టమైన పనైనా వెనుకడుగు వేయలేదని పేర్కొన్నారు. గుండె నిబ్బరంతో ఏ పనిపైనా సాధించారని… సాయం అడిగితే తేడా లేకుండా, రాజకీయ మాట ఇస్తే బంగారు ముఠా ఇచ్చినట్లేనని స్పష్టం చేశారు.

శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్సార్ అని…ఆయన జయంతి అందరికి పండుగ రోజు అని వెల్లడించారు. ఆయన చూపిన బాటలోనే… వైఎస్సార్ టిపి ఏర్పాటు చేసామని… వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావడానికి వచ్చామని పేర్కొన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయని.. పేదరికం రూపుమాపడం, సంక్షేమం, స్వయం సమృద్ధి పైనే పార్టీ దృష్టి పెట్టనుందన్నారు.

రైతు రుణామాఫీ, జలయజ్ఞంకు రూపకల్పన చేసిన దార్శనికుడు వైఎస్సార్ అని… పేదవాడు గొప్పవాడిలా కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లి వైద్యం చేయించుకుంటాడని ఎవరూ ఊహించలేదన్నారు. వైఎస్సార్ లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాడని.. ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు ఇప్పించాడని పేర్కొన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కొనసాగించారని… వైఎస్సార్ సంక్షేమ పాలన తెలంగాణ లో తీసుకురావడమే వైఎస్సార్ టిపి లక్ష్యమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సంక్షేమం లేదని.. పెట్టె పైసలు పెడుతునే ఉన్నామని.. ధనిక రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం లైన్లలో నిలబెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం నుంచి బయటపడింది కేసీఆర్ అని.. అధికారం ఉన్నప్పుడే ఫామ్ హౌజ్ చక్కపెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. దోచుకుంటున్నారు… దాచుకుంటున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news