ప్రతి రోజూలాగే ఇవాళ కూడా పెరిగిన పెట్రోల్ ధర

-

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంలేదు. ప్రతి రోజూ పెరుగుతునే ఉన్నాయి. దీంతో ఆ ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడుతోంది. రెండు నెలలుగా పెట్రోల్, డీజిల ధరలు పైపైకి పోతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 36 సార్లు ధరలు పెరిగాయి. దీంతో వ్యాపారులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఆయిల్ ధరలు మరీ దారుణంగా ఉన్నాయని అంటున్నారు. ఇక ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరల విషయానికి కొస్తే గురువారం‌తో పోల్చితే లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 15 పైసలు వరకూ పెరిగింది.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 100,56గా ఉండగా లీటర్ డీజిల్ రూ. 89,62‌గా ఉంది. అత్యధికంగా జైపూర్‌లో పెట్రోల్ రూ. 107,01గా ఉంది. డీజిల్ లీటర్ రూ. 98.41గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 104,50 కాగా డీజిల్ రూ. 97,68గా ఉంది. అయితే వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్లు ఒక్కో రకంగా ఉన్నాయి. కొన్ని చోట్ల లీటర్ పెట్రోల్ రూ.100 దిగువన ఉంది. మరికొన్ని చోట్ల 100కి పైగానే విక్రయాలు జరుగుతున్నాయి.

 

వివిధ నగరాల్లో పెట్రోల్,  డీజిల్ పెట్రోల్ ధరలు…

 

Read more RELATED
Recommended to you

Latest news