Fire Accident: బంగ్లాదేశ్‌ లో ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది మృతి

-

బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ దేశ రాజధాని నగరం ఢాకా  సమీపంలో రూట్ గంజ్ లోని ఫుడ్ ఫ్యాక్టరీ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరు అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 52 మంది మృతి చెందగా…. మరో యాభై మంది కి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ ఎత్తైన భవనం నుంచి దూకడంతో పలువురికి గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది.  కింది అంతస్తులో మొదలైన మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. దీంతో ఆ భవనం లో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బాటిల్ లు మరియు రసాయనాల కారణంగా ఈ మంటలు భారీగా చెలరేగాయి. దీని కారణంగానే ఈ ప్రమాదం భారీగా సంభవించింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో అంతా కార్మికులే ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news