గడిచిన 6నెలల్లో పెట్రోల్ ధరలు ఎంతలా ఎగబాకాయో తెలిసిందే. రోజు రోజుకీ పెరుగుతున్న ధరలు సామాన్యుడికి కష్టాలను మిగులుస్తున్నాయి. అటు పెట్రోల్, ఇటు వంటనూనెల ధరలు ఆకాశాన్ని దాటి చుక్కలను చేరుతున్నట్లుగా ఉన్నాయి. పెట్రోల్ దరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని విమర్శిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంపీ అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, 6నెలల కాలంలో పెంచిన పెట్రోల్ ధరలు, కేంద్ర ప్రభుత్వానికి 4లక్షల 91వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయని అన్నారు.
అదే కాదు మొత్తం 2014నుండి చూసుకుంటే పెట్రోల్ ధరల పెంపు ఆదాయం 25లక్షల కోట్లుగా ఉందని ఆరోపించారు. చత్తీశ్ ఘడ్ లో పెట్రోల్ పై పూర్తి వ్యాట్ ఎత్తివేసామని, దానివల్ల లీటరు పెట్రోల్ ధర 12రూపాయలు తగ్గిందని, మిగతా రాష్ట్రాలు కూడా ఈ విధంగా పెట్రోల్ ధరలను తగ్గించవచ్చని, ప్రస్తుత ప్రభుత్వం సామాన్యుడిపైనే భారాలు మోపుతుందని విమర్శించారు.