గడిచిన 24 గంటల్లో భారతదేశంలో కరోనా కేసులు ఎన్నంటే..?

-

కరోనా వైరస్ తో ఎంతో సతమతం అవుతున్నాము. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ఇప్పటికే బలైపోయారు. ఏది ఏమైనా కనీస జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇక కరోనా వైరస్ కేసులు గురించి చూస్తే..

దేశంలో కరోనా వైరస్ నెమ్మదిగా తగ్గుతున్నాయి . ఇక వాటి వివరాల లోకి వెళితే… గ‌త 24 గంట‌ల్లో 42 వేల 766 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అలానే రికవరీ రేటు 97.20 వుంది. మృతుల సంఖ్య  895 నమోదు అయినట్లు స్పష్టం చేసింది

ఇప్ప‌టివ‌ర‌కు 30,837,222 మందికి కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 187,242,453 మందికి కరోనా సోకింది. ఇక మృతుల సంఖ్య చూస్తే 408,040 గా నమోదు అయినట్లు స్పష్టం చేసింది.

corona-covid-test
corona-covid-test

ప్రపంచ వ్యాప్తంగ చూస్తే.. 4,402,295 గా నమోదు అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకూ మొత్తం 36 కోట్ల మందికి పైగా టీకా తీసుకున్నట్లు వైద్యారోగ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news