భారతదేశంలో చమురు ధరలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకి పెరుగుతున్న ధరలు సామాన్యుల పాలిట గుది బండలా తయారవుతున్నాయి. ఈ విషయంలో అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాలు సైతం మౌనంగా ఉండడం ఆశ్చర్యమే. ఐతే ఈసారి పెట్రోల్ ధరల పెంపుపై నిరసనలు చేపట్టడానికి కాంగ్రెస్ ముందుకు వచ్చింది. తెలంగాన వ్యాప్తంగా నిరసనలు చేపట్టడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సైకిల్ ర్యాలీ, ఎడ్లబండి ర్యాలీ నిర్వహించనుంది.
ఉదయం 11గంటలకు నిరసన కార్యక్రమం మొదలు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, నిర్మల్ జిల్లాలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ నిరసన సెగలు కేంద్ర ప్రభుత్వాన్ని తాకి, పెట్రోల్ ధరలు తగ్గుతాయా అన్నది చూడాలి.