టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో ఇవాళ టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ ఇవాళ టీఆర్ఎస్ లో లాంఛనంగా చేరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో తెలంగాణ భవన్ లో నిర్వహించనున్న సభలో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి ప్రసంగిస్తారు.
జల వివాదం నేపథ్యంలో… పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. అంతేకాదు కేంద్ర గెజిట్ పై కేసీఆర్ స్పందించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా… ఇటీవలే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్. రమణ రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన అనంతరం ఎల్. రమణ….టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 8న సీఎం కేసీఆర్ సమావేశమైన అనంతరం.. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు ఎల్. రమణ. తాజాగా ఇవాళ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.