ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఒక ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ఏర్పడి సముద్ర మట్టానికి 3.1 కిమీ & 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. మరియు ఎత్తుతో నైరుతి దిశలో వంగి ఉంటుంది.
దాని ప్రభావంతో, వచ్చే 48 గంటలలో వాయువ్య బంగాళాఖాతం & పరిసరాల్లో అల్ప పీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు-పడమర షీర్ జోన్ సుమారు 18 ° N లాట్ వద్ద సగటు సముద్ర మట్టంనుండి 4.5 కి.మీ & 5.8 కి.మీ మధ్య ఉంటుంది ,ఎత్తుతో దక్షిణ దిశగా వంగి ఉన్నది ఇపుడు బల హీన పడింది.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడనున్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ.