వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు విడుదల.. 3 లక్షల మందికిపైగా లబ్ది !

-

అమరావతి: వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు విడుదల చేసింది ఏపీ సర్కార్‌. వర్చువల్‌ ద్వారా నేరు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు ఏపీ సీఎం జగన్‌. కాపు, బలిజ, తెలగ కులస్తుల, ఒంటరి మహిళల అకౌంట్లలో నగదు జమ చేశారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ…
ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని…నిరుపేదలుగా ఉన్న కాపు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వాలంబన రావాలని ఈ మంచి పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు. వైయస్సార్‌ చేయూత మాదిరిగానే వైయస్సార్‌ కాపునేస్తం తీసుకు వచ్చామన్నారు.

క్రమం తప్పకుండా ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తూ పోతే ఐదేళ్లపాటు ఇలా 75వేలు అక్క చెల్లెమ్మల చేతిలో ఉంటుందని… తన కాళ్లమీద వాళ్లు నిబడగలుగుతారనే గొప్ప ఆలోచన నుంచి ఈ పథకం పుట్టిందన్నారు. గత ప్రభుత్వం పరిపాలనలో ఇదే కాపులకోసం ఏడాదికి ర.1000 కోట్లు ఇస్తామని చెప్పారని…కాని రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. ఈ రెండు సంవత్సరాల్లో అక్షరాల వివిధ పథకాల ద్వారా 59,63,308 మందికి గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా 15 రెట్లు మేర రూ. 12,126.78 కోట్లు సహాయం చేశామని తెలిపారు. ఇవాళ 3,27,244 మంది కాపు అక్కచెల్లెమ్మలకు లబ్ధి జరిగిందని గుర్తు చేశారు. రూ. 490.86 కోట్లు బటన్‌ నొక్కడం ద్వారా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news