విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ.. కేంద్రానికి కీలక ఆదేశాలు

-

అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలుకు కేంద్రం తాత్సారం చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈనెల 29న బిడ్డింగ్‌కు కేంద్రం పూనుకుంటోందని పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. బిడ్డింగ్‌పై కేంద్రప్రభుత్వాన్ని వివరణ కోరింది. దీంతో అలాంటిదేమీ లేదని కేంద్రం కోర్టుకు తెలిపింది. కౌంటర్ దాఖలుకు కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాది వారం సమయం కోరారు. ఈ మేరకు ఆగస్టు 2లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news