సంక్రాంతి సీజన్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఎఫ్-2 సినిమా సూపర్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది. దిల్ రాజు ఈ సినిమా ద్వారా భారీ లాభాలే రాబట్టుకునేలా ఉన్నాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేసిన ఈ మల్టీస్టారర్ సినిమా ఆర్టిస్టులుగా వెంకీ, వరుణ్ లకు ఎంత క్రెడిట్ ఇచ్చినా అసలు సినిమా ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడంలో దర్శకుడు అనీల్ రావిపుడి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే.
పటాస్ నుండి ఎఫ్-2 వరకు తీసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అందుకున్న అనీల్ రావిపుడి ఎఫ్-2 సినిమా అతని కెరియర్ బెస్ట్ హిట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఇక వరుసగా హిట్లు కొడితే దర్శకుడి డిమాండ్ పెరగడం కామనే. అందుకే నిన్నటిదాకా మూడు మూడున్నర కోట్లు తీసుకున్న అనీల్ రావిపుడి ఎఫ్-2 తర్వాత రెమునరేషన్ 5 కోట్లు చేశాడట. హిట్టు పడటంతో అమాంతం రేటు పెంచేశాడు అనీల్. అతని టాలెంట్ చూసిన నిర్మాతలు అతనికి 5 కోట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్-2 మూడు సినిమాలు దిల్ రాజు బ్యానర్ లో చేశాడు అనీల్.
ఎఫ్-2 సక్సెస్ మీట్ లో ఎఫ్-3 కూడా ఇదే కాంబినేషన్ లో ఇంతకంటే ఎక్కువ కామెడీ పండించే సినిమా చేస్తానని చెప్పాడు అనీల్. అందరు అతన్ని జంధ్యాల, ఈవివిలతో పోల్చుతున్నారు. మరి అనీల్ ఇదే హిట్ మేనియా కొనసాగిస్తాడో లేదో చూడాలి.