హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.జగన్‌కు బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం సీబీఐ వాదనలను కోర్టు విననుంది. జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని గత విచారణలో సీబీఐ కోర్టు ఆదేశించింది.
దీంతో సీబీఐ అధికారులు ఈ రోజు ధర్మాసనం ముందు లిఖిత పూర్వకంగా వాదనలు వినిపించనున్నారు. ఇప్పుడు సీబీఐ కౌంటర్ కీలకంగా మారింది. ఏపీ సీఎంగా జగన్ ఉండటం వల్ల పదే పదే బెయిల్ కండీషన్ ను ఉల్లంఘిస్తున్నారని, అటు సీబీఐ అధికారులు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడంలేదని పిటిషనర్ తరపు న్యాయవాది పదే పదే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై కూడా సీబీఐ ఇవాళ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.