ఒరు ఆదార్ లవ్ టీజర్ తో ఓవర్ నైట్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్న మళయాల భామ ప్రియా వారియర్ ప్రకాశ్. 27 సెకన్ల టీజర్ తోనే అంతర్జాలం అల్లకల్లోలం చేసిన ఆ టీజర్ టైంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెస్పాన్స్ ఇచ్చారు. మళయాళ సినిమానే అయినా ఆ టీజర్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ చూసి ఒరు ఆదార్ లవ్ సినిమాను అన్ని సౌత్ లాంగ్వెజెస్ లో రిలీజ్ చేస్తున్నారు.
తెలుగులో ఆ సినిమాను లవర్స్ డే టైటిల్ తో రిలీజ్ చేస్తుండగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఆ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. జనవరి 23న ఈ సినిమా తెలుగు ఆడియో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఆహ్వానించారట దర్శక నిర్మాతలు. బన్ని కూడా అందుకు ఓకే చెప్పాడని తెలుస్తుంది.
2018 గూగుల్ లో ఎక్కువగా వెతికిన హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో నిలిచిన ప్రియా ప్రకాశ్ తన సినిమాతో ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి. తెలుగులో ఇప్పటికే ఒకటి రెండు అవకాశాలు వచ్చినా వాటిని కాదన్న ప్రియా ప్రకాశ్ స్టార్ ఛాన్సులు మాత్రమే చేస్తానని చెబుతుంది. మరి ప్రియా ప్రకాశ్ కు ఛాన్స్ ఇచ్చే ఆ స్టార్ హీరో ఎవరో తెలియాల్సి ఉంది.