ప్రశాంతత కోసం పబ్లిక్ లేని ప్రాంతాలను పర్యటించాలని అనుకుంటున్నారా? ఇవి చూడండి.

-

కోవిడ్ వల్ల రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో తిరగలేకపోతున్నారు. అదీగాక ఇంట్లో ఉండీ ఉండీ బోర్ కొట్టింది. అందుకే కరోనా నుండి దూరంగా ఉంటూనే జనాలు ఎక్కువగా తిరగని ప్రాంతాలను పర్యటించాలని అనుకుంటున్నారు. అలాంటి ప్రదేశాల కోసం గూగుల్ లో వెతకాల్సిన పనిలేదు. ఇది మీకోసమే.

అరకు లోయ- ఆంధ్రప్రదేశ్

ఆంధ్రుల ఊటీగా పిలవబడే అరకు లోయ తూర్పు కనుమలలో ఉంది. చుట్టూ కాఫీ తోటలు, గిరిజన సంస్కృతితో ఆద్యంతం అద్భుత అనుభూతిని అందిస్తుంది. విశాఖపట్నం నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అందమైన లోయను దర్శించడానికి చాలామంది వస్తుంటారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతాన్ని కోరుకునేవారు ఈ ప్రదేశాన్ని మిస్ అవకండి.

హఫ్‌లాంగ్- అస్సాం

అసోంలో ఉన్న కొండ ప్రాంతమైన హాఫ్ లాంగ్, సముద్ర మట్టానికి 600మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ పొగమంచు కప్పబడిన కొండలతో చూడముచ్చటగా ఉంటుంది. పచ్చని వాతావరణంలో మనసులో నిశ్శబ్దం నిండుకున్నట్లుగా అనిపిస్తుంది. భారతదేశంలోని విభిన్న సంస్కృతిని ఇష్టపడేవారు ఈ ప్రదేశాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.

మున్సియారి- ఉత్తరాఖండ్

పితోర్ ఘడ్ మంచు పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రాంతం ఎనలేని అనుభూతులను అందిస్తుంది. హిమాలయాల అద్భుత సౌదర్యాన్ని వీక్షించడానికి అనువైన ప్రదేశం. పర్వత శిఖరాల వెనక సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి సుందర దృశ్యాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఇవే కాకుండా చిన్న చిన్న ట్రెక్కింగ్ చేయవచ్చు.

చాట్ పాల్- కాశ్మీర్

శ్రీనగర్ నుండి 88కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో అందమైన దేవదారు వృక్షాలు, ఆకాశంలోకి పొడుచుకున్నట్లుగా ఉండే చెట్లు దర్శనమిస్తాయి. ఇది నిశ్శబ్ద ప్రదేశం మాత్రమే కాదు చిన్న చిన్న సాహస యాత్రలు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news