అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో బంగారం ధర వరుసగా రెండో రోజు పెరిగింది. దీంతో దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.125 పెరుగుదలతో రూ.33,325కు చేరింది. పెళ్లిళ్ల హడావుడి ప్రారంభం కావడంతో దేశీ జువెలర్ల నుంచి బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. అయితే కేజీ వెండి ధర రూ.250 తగ్గుదలతో రూ.39,850కు వచ్చింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం క్షీణతతో 1,278.90 డాలర్లకు తగ్గింది. దీంతో డాలర్ బలపడటం ప్రతికూల ప్రభావం చూపింది.
వెండి ధర ఔన్స్‌కు 0.46 శాతం క్షీణతతో 15.26 డాలర్లను చేరింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.125 పెరుగుదలతో రూ.33,325కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.125 పెరుగుదలతో రూ.33,175గా నమోదైంది.