ఎన్.టి.ఆర్, చరణ్ లతో అఖిల్ జాయిన్ అయ్యాడు..!

-

ఈమధ్య టాలీవుడ్ స్టార్స్ మధ్య మంచి సానిహిత్యం ఏర్పడింది. వాళ్లు ఎప్పుడు ఒకేళా ఉంటుందా స్టార్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని దూరం చేసేందుకు ఎన్.టి.ఆర్, రాం చరణ్, మహేష్ తరచు కలుస్తూ తామంతా ఒక్కటే అని చెబుతూనే ఉన్నారు. ఎన్.టి.ఆర్, చరణ్ లైతే కలిసి నటించడమే కాదు ఎక్కడు వెళ్లినా కలిసి వెళ్తూ వస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా వీరితో పాటుగా అక్కినేని హీరో అఖిల్ కూడా జాయిన్ అయ్యాడు. మిస్టర్ మజ్ నుగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ ను స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేయగా తారక్ వచ్చి సినిమా సక్సెస్ ఆకాంక్షిస్తూ మాట్లాడాడు. ఇక ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం అఖిల్, తారక్ ఇద్దరు కలిసి చరణ్ ను కలిసి నట్టు తెలుస్తుంది. అఖిల్ కన్నా స్టార్డంలో తారక్, చరణ్ కాస్త ముందున్నా అఖిల్ వారితో కలిసి పార్టీ చేసుకోవడం అక్కినేని ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇస్తుంది. మరి ఎన్.టి.ఆర్, చరణ్ ల స్థాయి క్రేజ్ అఖిల్ ఎప్పుడు సంపాదించుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news