వర్షాకాలం: చర్మ సంరక్షణ విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం మగవాళ్ళకి ఉందా?

-

చర్మ సంరక్షణ గురించి మాట్లాడగానే ఆడవాళ్ళకి కావాల్సిన చర్మ సాధనాల గురించి మాట్లాడతారు. మగవాళ్ళకి చర్మ సాధనాలు ఉంటాయా? ఉన్నా పెద్దగా అవసరం లేదనే ఆలోచనలో ఉంటారు. కానీ, నిజానికి చర్మ సాధనాలు అందరికీ అవసరమే. రుతువు మారినపుడు వాతావరణంలో వచ్చే మార్పులు చర్మం మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అదీగాక రుతువు మారింది కాబట్టి చర్మ సాధనాలలో, సంరక్షణ విధానాల్లోనూ మార్పు తేవాలి.

దీని కోసం కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే,

రోజుకి రెండుసార్లు మీ ముఖాన్ని ఖచ్చితంగా కడగండి. పేరుకుపోయిన మురికి, మట్టి జిడ్డుదనం తొలగిపోవడానికి ముఖాన్ని కడగడం సరైన చర్య.

మీ ముఖం జిడ్డుగా ఉన్నట్టయితే ముఖం కడుక్కున్న తర్వాత టోనర్ ని వర్తించండి. మురికిని పోగొట్టడంలో ఇది ఉపయోగపడుతుంది.

ముఖం కడగగానే మాయిశ్చరైజ్ చేయండి. హ్యాలూరోనిక్ ఆమ్లం వాడండి. చర్మాన్ని తేమగా ఉంచడంలో ఇది కీలకంగా ఉంటుంది.

సన్ స్క్రీణ్ తప్పనిసరిగా వాడండి. వర్షాకాలం వలన సూర్యుని అతినీల లోహిత కిరణాలు మీ చర్మం మీద ప్రభావం చూపవని అనుకోవద్దు.

కళ్ళ కింద భాగాలను జాగ్రత్తగా చూసుకోండి. ఈ భాగంలో చర్మం సున్నితంగా ఉండడం వల్ల ముడుతలు ఏర్పడడానికి కారణం అవుతుంది. అందుకే విటమిన్ కె కలిగిన ఉత్పత్తులను వాడండీ.

ఆరోగ్యకరమైన ఆహారాలను తినండి. సలాడ్, ప్రోటీన్లు కలిగిన ఇతర ఆహారాలను మీ పాత్రలో ఉండేలా చూసుకోండి.

పొగతాగడం, మద్యం సేవించడం మానేయండి.

Read more RELATED
Recommended to you

Latest news