ఈ ఏడాది ప్రారంభం నుండి ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. దాంతో వాగులు వంకలు, ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు సంభవించాయి. అయితే గత వారం రోజులుగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఎండలు జోరందుకున్నాయి. దాంతో వర్షం కోసం వ్యవసాయదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ విభాగం ఐఎన్ డి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి ఉన్నట్లు స్పష్టంచేసింది. దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెండు రోజులపాటు కోస్తా మరియు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు… అలాగే తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఉక్కపోత తో సతమతమవుతున్న ప్రజలకు కూడా ఇది శుభవార్తే అని చెప్పాలి.