అరుదైన సమస్య.. గర్భాశయానికి బదులుగా ఉదర కుహరంలో పెరిగిన ఆడ శిశువు..!

-

తాజాగా ఒక అరుదైన సంఘటన జరిగింది. అయితే డాక్టర్లు ఉదరకుహురం (abdominal cavity) నుండి శిశువుని బయటకు తీశారు. అయితే మామూలుగా అయితే యుటెరస్ లో శిశువు ఉంటుంది. సి సెక్షన్ సమయంలో యుటెరస్ నుండి బిడ్డని తొలగించడం జరుగుతుంది. ప్లాసెంటా తో పాటు ఫెర్టిలజ్ అయినా ఎగ్ ఎదుగుతుంది. పోషకపదార్థాలు, ఆక్సిజన్ అక్కడ నుండి అందుతాయి.

కానీ ఈ కేసులో మాత్రం చాలా వింత జరిగింది. ఇది బౌల్ కి ఎటాచ్ అయి ఉంది. అంటే ఈ కేసులో శిశువు అబ్డోమినల్ కేవిటీ లో ఎదగడం జరిగింది. సాధారణంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు నాలుగు నెలలు లేదా ఐదు నెలల వరకే బతికి ఉండే అవకాశం ఉంది. కానీ ఈ కేసులో మాత్రం పూర్తిగా 9 నెలలు ఉండి డెలివరీ కూడా జరిగింది. ఇలా జన్మించిన ఈ బిడ్డ బరువు 2.65 కేజీలు.

అయితే ఈ కేసులో ఎక్కడ ఇబ్బంది అయింది అంటే..? ఆరో నెల అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కూడా ఈ విషయం తేలలేదు. ఇది ఇలా ఉంటే ఏడవ నెల ప్రెగ్నెన్సీ అయినప్పుడు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఈమె ఈ ఆసుపత్రికి వచ్చారని డాక్టర్లు అంటున్నారు. ఈ శిశువు కుడి వైపు ఉందని కుడి వైపు ఎక్కువ ఒత్తిడి పెట్టిందని అంటున్నారు డాక్టర్లు.

ఇలా ఉండడం వల్ల ఆమె యూరిన్ తో పాటు చీము కూడా వచ్చిందని అంటున్నారు డాక్టర్లు. అయితే ఈ మహిళకి సి సెక్షన్ జరిగినప్పుడు అబ్డామినల్ కేవిటీ లో శిశువు ఉందని తెలుసుకున్నారు 12 గంటల పాటు ఐసీయూ లో పెట్టిన తర్వాత బిడ్డని అప్పగించారు. ఆ మహిళ మాత్రం 24 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉండాలన్నారు. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news