డబ్ల్యూహెచ్‌ఓ సూచనల ప్రకారమే బడులు తెరిచామని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ తూగో జిల్లాలో నాడు- నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… కరోనా మహమ్మారి ప్రోటోకాల్స్ తో పాఠశాలలను ప్రారంభించామని… సెక్షన్లు ఎక్కువగా ఉంటే.. రోజు మార్చి రోజు క్లాసులు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు సీఎం జగన్. ఏ నిర్ణయమైనా పేద కుటుంబాలను దృష్టి లో పెట్టుకునే తీసుకున్నామన్నారు. పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందిస్తామని హా మీ ఇచ్చారు సీఎం జగన్. జగనన్న విద్యాకానుకగా బై లింగువల్ పాఠ్య పుస్తకాలు తీసుకు వచ్చామని… నోట్ బుక్స్, వర్క్ బుక్స్, 3 జతల యూనిఫామ్ క్లాత్ ఇస్తున్నామన్నారు సీఎం జగన్. ఈ పథకం కింద రూ. 1380 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యా కానుక కిట్ల పంపిణీ కింద రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్.