ఎముకులు ధృఢంగా ఉండాలంటే డైట్ లో వీటిని తీసుకోండి..!

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ లో ఈ ఆహారం తీసుకుంటే మంచిదని డాక్టర్లు అంటున్నారు. మనం తీసుకునే ఆహారం జీవన విధానం బట్టి ఆరోగ్యం ఉంటుంది. అయితే మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ప్రతి రోజు డైట్ లో తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

నట్స్:

నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇందులో ఫాస్పరస్ కూడా ఉంటుంది. ఇది ఎముకల్ని దృఢంగా చేస్తుంది.

చీజ్:

చీజ్ లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

పాలకూర:

పాలకూరలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా విటమిన్-కె కూడా ఉంటుంది. అదే విధంగా డైట్ లో బ్రోకలీ, క్యాబేజీ కూడా తీసుకుంటే మంచిది.

సాల్మన్:

సాల్మన్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలని దృఢంగా చేస్తుంది.

చికెన్:

చికెన్ ఆరోగ్యానికి మంచిది. ఇది ఎముకలు దృఢంగా ఉంచుతుంది. దీనిలో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. కనుక ఈ ఆహారాన్ని డైట్ లో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే విధంగా ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. కనుక రెగ్యులర్ గా డైట్ లో ఈ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండచ్చు.