కెసిఆర్ నెత్తి మీద అడుగు పెట్టి.. టిఆర్ఎస్ పాతాళానికి తొక్కుదాం : రేవంత్

-

మొదటి అడుగు ఇంద్రవెళ్లి, రెండో అడుగు రావిరాలలో వేశామన్న రేవంత్…మూడో అడుగు కేసీఆర్ నెత్తిన పెట్టి తొక్కుదామని పేర్కొన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీని కూడా పాతాళానికి తొక్కాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ రావిలాలలో నిర్వహించిన దళిత గిరిజన ఆశీర్వాద సభ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షం శుభసూచికం, కాంగ్రెస్ ను ఆశీర్వదించడానికి వరుణుడు వచ్చాడన్నారు. తెలంగాణలో సచ్చింది ఎవరు? తెలంగాణ వచ్చాక సంపదను దోచుకుంటున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలని సూచించారు.

కేసీఆర్ ఎంగిలిమెతుకలకు తెలంగాణ బిడ్డలు సిద్ధంగా లేరని..ప్రజల దుఃఖం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు తెలుసు అని వెల్లడించారు. చదువుకుంటే ప్రశ్నిస్తారని ఆ వర్గాలను చదువులకు దూరం చేస్తున్నారని..కేకే మహేందర్ రెడ్డి కష్టపడితే ఆయనకు ద్రోహం చేసి కేటీఆర్ కు టికెట్ ఇచ్చారని నిప్పులు చెరిగారు.

చంద్రబాబు ను బతిమాలుకుని కేటీఆర్ గెలిచారని…దళిత బిడ్డ ప్రదీప్ చంద్రను సీఎస్ గా ఒక్క నెలకే ఎందుకు రిటైర్ చేశావని ప్రశ్నించారు. దొర దగ్గర బానిసలుగా పనిచేయలేక ఐఏఎస్ ఉద్యోగాలకు మురళి, ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారని..ఇవ్వాల రాహుల్ బొజ్జను సిఎంవో లో పెట్టుకుంటే కేసీఆర్ ను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. హుజురాబాద్ లో ఓట్లు అవసరం కాబట్టే బయటకు వచ్చారని..బయటకు వచ్చిన దొంగను బండకేసి కొట్టాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news