చిత్తూరు జిల్లాలో అంధకారంలో నిలిచిపోయిన గ్రామం… ఒకరు మృతి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామం అంధకారంలో నిలిచిపోయింది. విద్యుత్ దీపాలతో దగద్ధయామానంగా వెలుగుతున్న ఊరు, ఒక్కసారిగా చీకటితో కప్పేసినట్టుగా అయ్యింది. చిత్తూరి జిల్లా చంద్రగిరి మండలం బుచ్చినాయుడు పల్లిలో ఈ సంఘటన జరిగింది. హైవోల్టేజీ కారణంగా గ్రామం మొత్తం అంధకారంలోకి వెళ్ళింది. ఇళ్ళలో ఉన్న టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాడుకలో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. ఈ హఠాత్ పరిమాణాకి గ్రామస్తులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ సంఘటనలో ఒక వ్యక్తికి షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. విద్యుత్ షాక్ తో శివ అనే 22ఏళ్ళ విద్యార్థి మరణించాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందంటూ గ్రామస్తులు ఆందోళన చేపడుతున్నారు. విద్యుత్ పర్యవేక్షణలో నిర్లక్ష్యం చేయడంతో హై వోల్టేజీ వచ్చిందని, దానివల్లనే ఈ అపాయం జరిగిందని అంటున్నారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news