తిరుపతి అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ…దేశ సరిహద్దులో పాకిస్థాన్, చైనాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ చర్యలను తిప్పికొడతామని కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ హయాంలో దేశంలో ఎక్కడా అల్లర్లు, ఉగ్రవాదుల దుశ్చర్యలు జరుగలేదని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారన్నారు.
దేశం కోసం త్యాగం చేసిన వారిని ఎప్పటికీ గుర్తించుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. దేశ రక్షణ కోసం తిరుపతి లాంటి ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారని కిషన్ రెడ్డి చెప్పారు.సైనికుల కుటుంబాలకు అండగా ఉండాలని కిషన్ రెడ్డి అన్నారు. వీరసతీమణుల ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారని చెప్పారు. సైనికుల వల్లే దేశంలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని కిషన్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందంటూ కిషన్ రెడ్డి చెప్పారు.