నకిలీ చలాన్ల ఈ వ్యవహారంపై జగన్ సీరియస్.. ఇంకా ఎన్నిరోజులు ఇలా !

-

అమరావతి : రాష్టానికి ఆదాయవనరులు అందించే శాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు వ్యవహారం పై సీరియస్ అయ్యారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి? ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని అధికారులపై మండిపడ్డారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?! అని అధికారులను ప్రశ్నించారు సీఎం జగన్. తప్పులకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్‌ చేశామని అధికారులు వివరించారు.

ఈస్థాయిలో తప్పులు జరుగుతుంటే.. ఎందుకు మన దృష్టికి రావడంలేదన్న సీఎం జగన్.. ఎప్పటినుంచి, ఎన్నిరోజులనుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి? అని నిలదీశారు. క్షేత్రస్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయా?లేవా?ఎందుకు చూడ్డంలేదు? క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకోవాలని ఆదేశించారు. అవినీతిపై ఎవరికి కాల్‌చేయాలో ప్రతి ఆఫీసులోనూ ఫోన్‌నంబర్‌ ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. అలాగే రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం..ప్రతిఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలన్నారు. జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా వచ్చే ఆదాయం వచ్చేలా చూసుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news