కరోనా వ్యాక్సిన్: ఫైజర్ టీకా ప్రభావంపై అనుమానాలు… వివరాలు వెల్లడించిన ఆక్స్ ఫర్డ్.

-

ప్రపంచ వ్యాప్త ప్రజలందరిపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉంది. అటు వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కేసులు వస్తునే ఉన్నాయి. దాదాపుగా ప్రపంచ మంత్రా వ్యాక్సినేషన్ నడుస్తుంది. ఐతే ఈ వ్యాక్సిన్ల పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై కొన్ని సందేహాలున్న మాట నిజమే. ఈ విషయంలో యూకేకి చెందిన ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం జరిపిన పరిశోధనలో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాకి చెందిన ఫైజర్ వ్యాక్సిన్ పై చేసిన పరిశోధనలో, దాని పనితీరు ఎలా ఉందనేది వివరించారు.

ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో మొదట్లో దాని ప్రభావం బాగానే ఉందని, కాకపోతే రోజులు గడుస్తున్న కొద్దీ వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోతుందని తెలిపింది. అస్ట్రాజెనికా వ్యాక్సిన్ విషయంలో అలా లేదని, దాని ప్రభావం చాలా రోజుల పాటు ఉన్నట్లు తేలిందని బయటకు వెల్లడించారు. మరి ఈ విషయంలో ఫైజర్ వారు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news