ప్రపంచంలోని అన్ని దేశాల్లో అతి తక్కువ కరోనా కేసులు నమోదవుతున్న దేశాలను చూసుకుంటే ఆ జాబితాలో న్యూజిలాండ్ మొదటి మూడు, నాలుగు స్థానాల్లో ఉంటుంది. కరోనా మొదటి వేవ్ నుండి చూసుకున్నా కూడా న్యూజిలాండ్ లో నమోదయిన కేసులు చాలా తక్కువ. అక్కడి ప్రభుత్వం తీసుకున్న విధానాలు, చేపట్టిన చర్యలు, కరోనా ఉధృతి లేవనెత్తకుండా చేసాయి. అక్కడి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై తాజాగా జరిగిన సంఘటన సాక్ష్యంగా నిలుస్తుంది.
ఇటీవల కాలంలో న్యూజిలాండ్ లో ఒక కరోనా కేసు నమోదైంది. ఈ కరోనా సోకిన వ్యక్తి ఎక్కడ నుండి వచ్చాడనే విషయమై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆస్ట్రేలియా సిడ్నీనుండి న్యూజిలాండ్ ఆక్లాండ్ కి వచ్చిన కారణంగా ఈ వ్యక్తికి కరోనా సోకినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. సిడ్నీలోనే అతనికి కరోనా సోకిందని, ఆ తర్వాత ఆక్లాండ్ వచ్చాక క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడని ప్రధాని జసంద తెలిపారు. మొత్తానికి కరోనా కేసు గుట్టు కనిపెట్టి వ్యాపించకుండా చేశారు.