యాక్సిస్ బ్యాంక్ కస్టమర్స్ కి ముఖ్యమైన ఎలర్ట్. దేశీ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ తాజాగా కొత్త రూల్స్ ని తీసుకు రావడం జరిగింది. కనుక కస్టమర్స్ వీటిని తెలుసుకోవాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు లోకి రాబోతున్నాయి. దీంతో చెక్ బుక్ వాడే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది అని తెలిపింది.
ఒకటో తేదీ నుంచి చెక్ క్లియరింగ్ సిస్టమ్ మారబోతోంది. పాజిటివ్ పే వివరాలు అందించకపోతే చెక్ వెనక్కి ఇచ్చేస్తారు గమనించండి. ఒకటో తేదీ నుంచి చెక్ క్లియరింగ్ తేదీకి ఒక్క రోజు ముందు అయినా పాజిటివ్ పే వివరాలు ఇవ్వాలి. ఒకవేళ కనుక ఇవ్వకపోతే చెక్ క్లియర్ కాదు గమనించండి. అయితే ఇది రూ.5 లక్షలకు లేదా ఆపైన చెక్ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. అయితే మామూలుగా 2021 జనవరి 1 నుంచే పాజిటివ్ పే సిస్టమ్ అమలులోకి వచ్చింది.
ఇందులో భాగంగా చెక్ ఇచ్చి వారు కచ్చితంగా బ్యాంక్‌కు ఆ చెక్ వివరాలను (పేరు, అమౌంట్ వంటివి) అందించాల్సి ఉంటుంది. అయితే ఈ సమాచారాన్ని ఎస్ఎంఎస్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఇవ్వచ్చు. బ్యాంక్ కి స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే ఇచ్చిన వివరాలను చెక్ చేసుకొని చెక్‌ను క్లియర్ చేస్తారు. చెక్‌లోని వివరాలను, మీరు ఇచ్చిన వివరాలను చెక్ చేసుకొని చెక్‌ను క్లియర్ చేస్తారు. ఒకవేళ వివరాలు వేరేగా ఉంటే ఆ చెక్ పెండింగ్‌లోనే ఉంటుంది. క్లియర్ అవ్వదు గమనించండి. ఈ కొత్త రూల్ ని ఆర్బీఐ తీసుకువచ్చింది.