BREAKING : ఏపీలో పలు చోట్ల భూప్రకంపనలు

-

బంగాళాఖాతంలో ఇవాళ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1 గా నమోదయింది. ఈ నేపథ్యంలో లో తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు – ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.

ఈ మధ్యాహ్నం 12:35 గంటల ప్రాంతంలో భూమి కి పది కిలోమీటర్ల నూతన భూమి కన్పించిందని వివరించింది. అటు ఏపీ లోని కాకినాడకు దక్షిణ మరియు ఆగ్నేయ దిశలో 296 కిలోమీటర్లు, రాజమండ్రి కి దక్షిణాన మరియు ఆగ్నేయంగా 312 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఇక ఈ భూకంప ప్రభావం తో చెన్నై లోని పలు ప్రాంతాల్లో ప్రజలు… ఇల్లు, ఆఫీస్ లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఇది భూకంపం మాత్రమేనని.. ఎలాంటి సునామీ హెచ్చరిక లు లేవని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news