బుల్లెట్ బండి పెళ్లికి కూతురికి ల‌క్కీ ఛాన్స్.. ప్రొడ్యూస‌ర్ నుండి ఫోన్..!

-

సోషల్ మీడియా ప్రభావంతో రాత్రికి రాత్రే కొంత‌మంది స్టార్స్ అవుతున్నారు. అలా ఈ మ‌ధ్య సెల‌బ్రెటిగా మారింది ఓ యువ‌తి. తెలంగాణ జాన‌ప‌దం బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేస్త బా డుగ్గు డుగ్గు అంటూ స్టెప్పులేసి ఇప్పుడు ఏకంగా ఆల్బ‌మ్ సాంగ్ లో న‌టించే అవ‌కాశం అందుకుంది. జ‌న్నారం కు చెందిన సాయి శ్రీయ‌కు రామ‌కృష్ణాపూర్ కు చెందిన ఆకుల అశోక్ తో వివాహం జ‌రింగింది. కాగా వారి పెళ్లి భ‌రాత్ లో సాయి శ్రీయ బుల్లెట్ బండెక్కి వ‌చ్చేస్తా బా అనే జాన‌ప‌దానికి స్పెప్పులు వేసింది.

bullet bandekki song
bullet bandekki song

సాయి శ్రీయ చేసిన డ్యాన్స్ రెండు రోజుల‌కు నెట్టింట వైర‌ల్ గా మారింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి రావ‌డ‌మే కాకుండా మూడు రోజుల పాటు సోష‌ల్ మీడియాను షేక్ చేసేసింది. దాంతో త‌మ పాట‌కు క్రేజ్ తీసుకువ‌చ్చిన సాయి శ్రీయ‌కు ఇప్పుడు బుల్లెట్ బండెక్కి పాట‌ను నిర్మించిన నిర్మాణ సంస్థ బ్లూ రాబిట్ ఎంట‌ర్టైన్మెంట్స్ నిర్వాహ‌కులు నిరూప స్పందించారు. బుల్లెట్ బండి పాట‌కు డ్యాన్స్ చేసిన యువ‌తికి త‌మ నెక్స్ట్ ఆల్బ‌మ్ లో డ్యాన్స్ చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news