బిడెన్‌పై హీరో నిఖిల్‌ సంచలన వ్యాఖ్యలు… చెప్పు తెగుద్ది ఎదవా !

-

అఫ్ఘానిస్తాన్‌లో రాజ్యంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. తాలిబన్ల భయానికి చాలా మంది ప్రజలు ఆ దేశాన్ని వదిలేసి.. ఇతర దేశాలకు తరలిపోతున్నారు. అటు ఆ దేశం లో తాలిబన్లు… కఠిన నిబంధనలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే… తాలిబన్ల చేతుల్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్‌ విషయం లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యవహరిస్తున్న తీరు పై టాలీవుడ్‌ స్టార్‌ హీరో నిఖిల్‌ సీరియస్‌ అయ్యారు. చెప్పు తెగుద్ది ఎదవా అంటూ తీవ్ర స్థాయిలో నిఖిల్ దూషించారు.

”మీరు అఫ్గానిస్తాన్‌ ను 21 ఏళ్లు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఈ దుస్థితి లో వదిలే శారు. మిస్ట్‌ జో బైడెన్‌ మరోసారి ఫ్రీడమ్‌ గురించి మాట్లాడితే.. చెప్పు తెగుతుంది” అంటూ హీరో నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియా లో తెగ వైరల్‌ అవుతోంది. అయితే.. ఈ ట్విట్‌ కు కొందరు వ్యతిరేకంగా స్పందిస్తుంటే… మరి కొందరేమో పాజిటివ్‌ గా రెస్పాండ్‌ అవుతున్నారు. మన దేశంలో పెట్రోల్‌ రేట్లపై ప్రధాని మోడీ ని ప్రశ్నించాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news