భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంటికి పది లక్షలు ఇస్తే తాను రాజీనామా చేస్తానని..ఇక ముందుపోటీ చేయబోనని పేర్కొన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిఎం కెసిఆర్ కూతురు కవిత కు టికెట్ ఇస్తే తానే గెలిపిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తుర్కపల్లి(మ) రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్ష లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని… వాసాలమర్రి కి సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా అడ్డుకుంటామని హెచ్చరించారు. దళిత బంధుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బొంద తొడుకున్నాడని.. ఆ బొంద మేమే పుడుస్తామని హెచ్చరించారు.
సీఎంఓ రాహుల్ బోజ్జ చోటు ఇవ్వగానే దళితలందరికి ఇచ్చినట్టా? ఇంటికి కిలో బంగారం ఇచ్చిన ఎవరు ఓటు వేయరని స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలేకనే కొకపేట భూములు అమ్మిన బ్రోకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలేరు నియోజకవర్గన్ని దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఏడుగురు రెడ్లు, నలుగురు వెలమలకు చోటు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క దళితుడికి చోటు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు.