మీ పేరుతో ఎవరైనా సిమ్ కార్డుని వాడుతున్నారా లేదా అనేది ఈ ప్రభుత్వ వెబ్సైట్ లో చూడచ్చు..!

-

ది డిపార్ట్మెంట్ అఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) సరికొత్త పోర్టల్ ని లాంచ్ చెయ్యడం జరిగింది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ మరియు కన్స్యూమర్ ప్రొటెక్షన్‌కు ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎవరైనా తమ పేరుతో సిమ్ కార్డుని ఉపయోగిస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది.

అలానే ఈ పోర్టల్ కనెక్షన్స్ గురించి కూడా చెబుతుంది. ఒకవేళ కనుక మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటే కూడా తెలుసుకోవచ్చు. దీంతో రిపోర్ట్ చేసి వాటిని బ్లాక్ చేయొచ్చు. లేదా డిఆక్టివేట్ చెయ్యొచ్చు. సబ్స్క్రైబర్లు తమ పేరుతో 9 కంటే మల్టిపుల్ కనెక్షన్స్ ఉండి.. వాళ్ళ పేరుతో ఉంటే రిక్వెస్ట్ పెట్టి వాళ్ల నెంబర్ ని లాగిన్ చేసి, టికెట్ ఐడి రిఫరెన్స్ నెంబర్ ని ఎంటర్ చేసి తగిన యాక్షన్ తీసుకోవచ్చు.

ఒకసారి ఈ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత TAFCOP website మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటిపి ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ల ఐడితో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ వివరాలు వస్తాయి. దీనిని ఏప్రిల్ లో మొదట లాంచ్ చేశారు. దీని ద్వారా మీకు తెలియకుండా మీ వివరాలతో సిమ్ కార్డ్ ని తీసుకుని వాడుతున్నట్లయితే ఈ పోర్టల్ ద్వారా వాటిని తెలుసుకోవచ్చు. అయితే ఇది ఏపీ మరియు తెలంగాణాలో రిజిస్టర్ అయినా మొబైల్ నెంబర్లు మాత్రమే చూపిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news