అలర్ట్ : మూడు రోజుల పాటు భారీ వర్షాలు

-

ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఏర్పడిన “అల్పపీడనం” ప్రస్తుతము దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 km ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. “రుతుపవన ద్రోణి” బికనేర్, అజ్మీర్, శివపురి, దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం, విశాఖపట్నంల మీదగా మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.

ఈ రోజు తూర్పు-పడమర ‘షీర్ జోన్'(ద్రోణి) 15°N అక్షాంశము వెంబడి సగటు సముద్ర మట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య స్థిరంగా కొనసాగుతున్నది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news