గుడ్ న్యూస్..త‌గ్గిన పెట్రోల్, డీజీల్ ధ‌ర‌లు..!

-

గ‌త కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూ పోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా పెట్రోల్, డీజీల్ ధ‌ర‌లు రెండు రోజుల విరామం త‌ర్వాత స్వ‌ల్పంగా త‌గ్గాయి. పెట్రోల్ లీట‌ర్ పై 17పైస‌లు, డీజిల్ లీట‌ర్ పై 18 పైస‌లు త‌గ్గింది.దాంతో హైద‌రాబాద్ లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.105 ఉండ‌గా డీజీల్ ధ‌ర రూ.96.66కు త‌గ్గింది.

ఇదిలా ఉంటే పెట్రోల్ రేట్లు గతంలో ఎప్పుడూ లేనంతగా పెర‌గ‌టానికి కార‌ణం బీజేపీ ప్ర‌భుత్వ‌మే అని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తుంటే…బీజేపీ మాత్రం గ‌తంలో కాంగ్రెస్ తీసుకున్న త‌ప్పుడు నిర్న‌యాల వ‌ల్లే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచాల్సి వ‌చ్చింద‌ని ఇప్ప‌ట్లో ధ‌ర‌ల‌ను త‌గ్గించే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెప్పేసింది. ఏది ఏమ‌యినా ఇంధ‌న ధ‌ర‌లు పెర‌గ‌టంతో ఆ ప్ర‌భావం నిత్యావ‌స‌రాల‌పై కూడా ప‌డింది. దాంతో సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news