ఈటల.. హరీష్.. కౌంటర్ కి ఎన్ కౌంటర్.. ముదురుతున్న మాటల యుద్ధం

తెలంగాణ పార్టీకి, హుజురాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. రాజీనామా చేసినప్పటి నుండి అటు కేసీఆర్ పై, ఇటు హరీష్ రావుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఐతే ఇటు ఈటల వ్యాఖ్యలపై హరీష్ రావు ఎన్ కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన సంఘటన అందుకు మరోమారు సాక్ష్యంగా నిలిచింది. ఈటల, హరీష్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకీ పెరుగుతుందని అర్థం అవుతుంది.

హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం అందరిలోనూ చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కేసీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు. దమ్ముంటే హుజురాబాద్ లో నాపై కేసీఆర్ లేదా హరీష్ రావు పోటీ పడాలని, ఆ ధైర్యం ఉందా వాళ్ళకి ఉందా అని సవాల్ విసిరారు. దీనిపై హరీష్ రావు ఎన్ కౌంటర్ ఇచ్చారు. బొట్టుబిళ్ళలు పంచితే ఓట్లు పడవని, అరవై రూపాయల గడియారం ఇచ్చిన వారికి ఓటు వెయ్యాలో లేదా ఆడపిల్ల లక్ష రూపాయలు ఇచ్చేవారికి ఓటు వెయ్యాలో వారికి తెలుసని కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి హుజురాబాద్ ఉపఎన్నిక, ఈటల రాజేందర్, హరీష్ రావుల మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచనుందని తెలుస్తుంది.