కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమిత్ షా టూర్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. అమిత్ షా ఈ నెల 17 తెలంగాణ కు వస్తారని తెలుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అదే రోజు బండి సంజయ్ నిర్మల్ కు చేరుకుని అక్కడ భహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. అయితే అదే సభకు అమిత్ షా కూడా హాజరు కాబోతున్నారు.
గత కొన్నేళ్లుగా బీజేపీ తెలంగాణ లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే రోజున సభను నిర్వహించడం తో అమిత్ షా కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తెలంగాణ లో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన లో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తికరం గా మారింది.