తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు భారీ వర్షాలు

-

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వదిలేలా లేవు. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి వర్షాలు. ఇటు తెలంగాణ.. అటు ఏపీలో వానలు దంచికొడుతున్నాయి. వాగులు.. వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరో మూడు రోజుల పాటు అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణశాఖ. ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావం బంగాల్‌, ఒడిశాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఐతే.. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈనెల 11 వరకు కోస్తాంధ్ర తీరప్రాంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్‌ మహా నగరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం రోజు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి కూడా భారీ వర్షాలు పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news