తొలిసారిగా విమానంలో ప్రయాణం.. నీరజ్ చోప్రా ఎమోషనల్ పోస్ట్

-

గోల్డెన్ బాయ్… నీరజ్ చోప్రా… తన తల్లిదండ్రుల చిరకాల కోరికను తీర్చాడు. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పసిడి పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా…. వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన భారత తొలి అథ్లెట్ గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 23 ఏళ్ళ వయస్సులోనే ఈ రికార్డు సాధించి… తన ఎదుగుదలకు ఎంతగానో పాటుపడిన తల్లిదండ్రులు మరియు కోచ్ లు… సాయం అందించిన ప్రభుత్వాలకు అరుదైన కానుక అందించాడు.

ఇక ఇది ఇలా ఉండగా… తాజాగా తన చిన్న నాటి మరియు చిరకాల కలను నిజం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. తల్లిదండ్రులు సరోజినీ దేవి, సతీష్ కుమార్ నువ్వు తొలిసారిగా విమానం ఎక్కించాడు నీరజ చోప్రా. ఇందుకు సంబంధించిన ఫోటోలను శనివారం షేర్ చేసిన నీరజ్ చోప్రా….”నా కల నేడు నెరవేరింది. మొట్టమొదటి సారిగా నా తల్లిదండ్రులు విమాన ప్రయాణం చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం వల్లే ఇదంతా సాధ్యమైంది” అంటూ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం నీరజ్ చోప్రా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అటు… ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news