అమరావతి : జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాల లబ్దిదారులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీపై జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కోరుకున్న లబ్జిదారులకు ల్యాప్ టాపులను సరఫరా చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది జగన్ సర్కార్. ఇందులో భాగంగానే ల్యాప్ టాపుల కావాలని 5.50 లక్షలకు పైగా అమ్మఒడి, వసతి దీవెన లబ్దిదారులు కోరారు.
ఈ మేరకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. బేసిక్ కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లకు టెండర్లు పిలువగా.. ల్యాప్ టాపుల సరఫరా కోసం బిడ్లు దాఖలు చేయాల్సిందిగా కోరింది ఏపీ టెక్నాలజీ సర్వీసెస్. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు టెండరు విలువ రూ. 100 కోట్ల పరిమితి దాటడంతో టెండరు నోటీసులోని అంశాలను జుడిషీయల్ రివ్యూకు పంపింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా [email protected]కు అభ్యంతరాలు, సూచనలు, సలహాలు పంపాలని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం తో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.