సెప్టెంబర్ 19వ తేదీన ఐపీఎల్ రెండవ విడత మొదలవుతున్న సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా ప్రారంభం కాబోతున్న ఈ రెండవ విడతకి ఆటగాళ్ళందరూ సిద్ధం అవుతున్నారు. మొదటి విడతలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ప్రస్తుతం అలాంటి ఆటతీరే చూపిస్తే ఈ సారి ఫైనల్ వరకు వెళ్ళి కప్ నెగ్గే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఐతే ఇక్కడ కోహ్లీకి కష్ట సమయం ఎదురైందని గంభీర్ వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ తో సుదీర్ఘ టెస్టు మ్యాచుల తర్వాత మొదలవబోతున్న ఐపీఎల్ లో కోహ్లీ సర్దుకోవాల్సిన అవసరం ఉంటుందని, అక్కడ ఆడిన ఆటకి, ఇక్కడ ఆడబోయే ఆటకి తేడా చూపాల్సిన అవసరం ఉందని అన్నాడు.
ఎందుకంటే కోహ్లీ పరుగుల మెషిన్ అనీ, జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో కోహ్లీ ముందుంటాడని, అతడితో పాటు ఏబీ డివిలియర్స్ కూడా కలిస్తే మరింత బాగుంటుందని అన్నాడు. కానీ ఈ ఇద్దరూ ఆటలో సర్దుకోవాల్సిన అవసరం ఉందని, అది ఎంత తక్కువ టైమ్ లో జరిగితే అంత బాగుంటుందని తెలిపాడు.