నెలకి యూట్యూబ్ రూ. 4 లక్షలు ఇచ్చింది: యూనియన్ మినిష్టర్ నితిన్ గడ్కారి లాక్ డౌన్ విషయాలు..!

-

యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కారి శుక్రవారం నాడు కరోనా మహమ్మారి సమయంలో ఆయన యొక్క సమయాన్ని ఎలా వెచ్చించారు అనే దాని గురించి చెప్పడం జరిగింది. హర్యానా లో ఒక ఈవెంట్ లో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. అయితే కరోనా మహమ్మారి సమయంలో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితమవ్వడం… ఇంట్లోనే ఏదో ఒకటి చేయడం జరిగింది.

 

 Nitin Gadkari

అయితే యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇంట్లో ఉండి ఏం చేశారు అనే దాని గురించి తెలియజేశారు. కరోనా మహమ్మారి సమయంలో కేవలం నేను రెండే రెండు పనులు చేశారని ఆయన అన్నారు. నేను ఇంట్లో వంట చేశాను.. అలానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లెక్చర్స్ ఇచ్చాను అని ఆయన చెప్పారు.

ఆన్లైన్లో నేను ఎన్నో లెక్చర్స్ ఇచ్చాను అవి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశాను అని ఆయన అన్నారు. అయితే యూట్యూబ్ నాకు నాలుగు లక్షల రూపాయలు నెలకి ఇచ్చింది అని ఆయన అన్నారు. అలానే తన మామ గారి ఇల్లుని కూల్చేయాలని ఆర్డర్ ఇవ్వడం.. తన భార్యకి కూడా అది తెలియదు అని అన్నారు. పైగా అప్పుడే వాళ్ళకి కొత్తగా పెళ్లయింది అని కూడా ఆయన అన్నారు అయితే రోడ్డు కి మధ్యలో తన మామ గారి ఇల్లు ఉంటుందని తన భార్యకి కూడా చెప్పకుండా ఆ ఇంటిని కూల్చివేయాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది అని చెప్పారు. అయితే తనకి కూడా అక్కడ ఇల్లు ఉందని రోడ్డు నిర్మాణానికి దానిని తొలగించాల్సిన అవసరం ఉందని అధికారులు తనకు తెలియజేశారని మినిస్టర్ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news