తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినం సందర్భంగా శుభాకాంక్షలు అని ఆమె ట్వీట్ చేశారు. ” సెప్టెంబర్ 17 న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వాతంత్య్ర పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు హైదరాబాద్ విమోచన దినం జరుపుకోవాలని, ఘనంగా నివాళులు అర్పించాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.” అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఈ రోజు విమోచన దినమా లేదా విలీన దినమా అనే దాని పై… బిజెపి పార్టీ మరియు టిఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమోచన దినం అని బిజెపి పార్టీ అంటుండగా… విలీన దినం అని టిఆర్ఎస్ పార్టీ చెబుతోంది. అటు కాంగ్రెస్ కూడా తెలంగాణ విలీన దినోత్సవం గానే వేడుకలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళ సై ట్వీట్ చేయడం రాజకీయ చర్చ కు దారి తీసింది.
My heartiest wishes to all people of Telangana on the occasion of Hyderabad Vimochana Dinam being celebrated on 17th September.
I appeal to all to celebrate Hyderabad Vimochana Dinam & pay rich tributes to the Martyrs, who made supreme sacrifices in the freedom struggle.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 17, 2021