కాంగ్రెస్ అధికారంలోకి వస్తే…సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం : రేవంత్

-

కాంగ్రెస్ అధికారం లోకి వస్తే…సెప్టెంబరు 17 ను అధికారికంగా నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గాంధీ భవన్ లో తెలంగాణ విలీన దినోత్సవం వేడుకలు జరిగాయి. ఏఈ సందర్భాంగా జెండా ఎగరేసారు రేవంత్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్వతంత్ర పోరాటానికి నెహ్రూ సహకరించారని. హోం మంత్రి ప్రత్యేక నిర్ణయాలు ఉండవన్నారు.

ఆపరేషన్ పోలో నిర్ణయం నెహ్రూ దేనని.. హోమంత్రి నిర్ణయం గా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పూర్వీకుల ఆస్తిని బీజేపీ దొంగతనం చేస్తుందని.. మి పార్టీ లో ఉన్న స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొన్న వాళ్ళు ఉంటే వారి గురించి చెప్పుకోండి? అని ప్రశ్నించారు. మా పార్టీ నాయకుల ఫోటో లు పెట్టుకుని లబ్ది పొందాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య.. కొమరం భీం లాంటి వాళ్లంతా నిజాం పై పోరాటం చేశారన్నారు. నిజాం పై హిందువులతో పాటు..షోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు అప్రతంగా ఉండాలని.. మతాల మధ్య బిజేపి మరియు టిఆర్ఎస్ చిచ్చు పెడుతున్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news