నారా లోకేశ్ చుట్టు బిగస్తున్న ఉచ్చు..?

-

టీడీపీ భావినేతగా నారా లోకేశ్ ఉన్న సంగతి అందరికీ విదితమే. ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. టీడీపీని బలోపేతం చేసే మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీసీ నేతలు లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు. కాగా, లోకేశ్ రాజకీయాలకు బ్రేక్ పడనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేశ్ మంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణం వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై లోకేశ్ స్పందిస్తూ ఆధారాలు చూపించాలంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫైబర్ నెట్ కుంభకోణంలో పాత్ర ఉన్నవాళ్లను అరెస్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. దాంతో లోకేశ్ ఇక సైలెంట్ అయ్యే చాన్సెస్ ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.

nara lokeshఅప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్ ఉన్న సమయంలోనే ఆయన కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టును టెరా సాఫ్ట్ అనే కంపెనీకి అర్హత లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు ఇచ్చారని తెలుస్తోంది. ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయమై సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో రూ.330 కోట్ల మేర అవినీతి జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీఐడీ పోలీసులు ఆల్రెడీ 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో భాగంగా ఏ2 స్థానంలో ఉన్న సదరు కంపెనీ ఎండీ సాంబశివరావును అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఈ కేసు చివరకు నారా లోకేశ్ మెడకు చుట్టుకోవడం ఖాయమనే పలువురు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి.. రాబోయే రోజుల్లో ఫైబర్ నెట్ కుంభకోణం టీడీపీని, లోకేశ్‌ను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో..

Read more RELATED
Recommended to you

Latest news