హనుమంతుడిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు..!

-

హనుమంతుడికి పూజ చేయడం వల్ల శుభం కలుగుతుంది. అందుకనే చాలా మంది మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధిస్తారు. రామభక్తుడైన హనుమంతుడు రామాయణం లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా కొలువబడుతున్న దేవుడు ఆంజనేయుడు. అయితే మంగళవారం నాడు హనుమంతునికి పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కనబడతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు హనుమంతుడి పూజ గురించి ఇప్పుడే క్లుప్తంగా చూద్దాం.

 

lord-hanuman
lord-hanuman

ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయడం వల్ల సర్వత్ర జయం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేయడం వల్ల ఆయుష్షు, ఆరోగ్యం ప్రసాదించడం తో పాటు కోరిన కోరికలు తీరుతాయి అని భక్తుల నమ్మకం. అలానే నిద్రించేముందు ప్రయాణానికి ముందు ఆంజనేయుడిని స్మరించిన వారికి మృత్యు భయం తొలగుతుంది.

అదే విధంగా సర్వత్రా విజయం లభిస్తుంది. సంతానం లేనివారు మండలం రోజులపాటు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. అలానే అరటిపండు నివేదించి.. ప్రసాదంగా తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది. హనుమంతుడికి పూజ చేసేటప్పుడు అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ నైవేద్యం కింద పెడితే స్వామివారి అనుగ్రహం తప్పక కలుగుతుంది కనుక పూజ చేస్తప్పుడు దీనిని మరిచిపోకండి.

హనుమంతుడికి ఐదు సంఖ్య అంటే ఎంతో ఇష్టం. కనుక హనుమాన్ మందిరంలో ఐదు ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఆంజనేయ స్వామిని పూజించడం వలన శరీరానికి బలాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. అలానే హనుమంతుడిని పూజిస్తే గ్రహదోషం తో బాధపడే వాళ్ళకి గ్రహశాంతిని కూడా పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news