IPL 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

-

ఐపీఎల్ –  2021 రెండవ భాగం లో… ఇవాళ కోల్ కత్తా నైట్ రైడర్స్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అబుదాబీ లోని షేక్ జయాద్ స్టేడియం లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే  ఇందులో  టాస్  గెలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీం… మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

దీంతో … కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు… మొదట ఫీల్డింగ్ చేయనుంది. పిచ్ పరిస్థితులను బట్టి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నట్లు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. కాగా నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి విధితమే. 20 పరుగుల తేడాతో ముంబై జట్టుపై ఘన విజయం సాధించింది సూపర్ సూపర్ కింగ్స్.

Read more RELATED
Recommended to you

Latest news