పేపర్ బాయ్ బుడ్డోడికి కేటీఆర్ ఫిదా..!

-

మంత్రి కేటీఆర్ ఓ వీడియో షేర్ చేసి వీడియోలో బుడ్డోడి మాట‌ల‌కు ఫిదా అయ్యారు. జ‌గిత్యాల‌కు చెందిన ఈ వీడియో త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థి శ్రీ ప్ర‌కాష్ కాన్ఫిడెన్స్ కు అత‌డికి జీవితం పై ఉన్న క్లారిటీ ఎంతో భాగుతందని అన్నారు. వీడియోలో ప్ర‌కాష్ ను వీడియో తీస్తున్న వ్య‌క్తి ఎక్క‌డ చ‌దువుకుంటున్నావ్ అని అడగ్గా జ‌గిత్యాల గ‌వ‌ర్న‌మెంట్ హైస్కూల్ అని చెప్పాడు.

చ‌దువుకుంటున్న వ‌య‌సులో పేప‌ర్ వేస్తున్నావేంటి అని అడ‌గ్గా చ‌దువుకునే వ‌య‌సులో పేప‌ర్ వేయ‌ద్దా..?ఇప్పుడు క‌ష్ట‌ప‌డితేనే భ‌విష్య‌త్ లో భాగుంటుంద‌ని స‌మాధానం ఇస్తున్నాడు. ఇక దాంతో వీడియో తీసిన వ్య‌క్తి వెరీ గుడ్ అని చెప్పాడు. ఇక వీడియోలో బుడ్డోడి ఎక్స్ప్రెష‌న్స్ కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా క‌నిపిస్తున్నాయి. దాంతో కేటీఆర్ బుడ్డోడిపై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇక ఈ వీడియోకు నెటిజ‌న్లు చ‌దువుతో ఉద్యోగం వ‌స్తుందో రాదో తెలియ‌దు కాబ‌ట్టి ముందే విద్యార్థి మంచి నిర్ణ‌యం తీసుకున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news